Novak Djokovic : స్పెయిన్ స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్(Novak Djokovic) మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న అతను సిన్సినాటి ఓపెన్(Cincinnati Open 2023) చాంపియన్‌గా నిలిచి రఫెల్ నాదల్(Rafael Nadal) రికార్డు బ్రేక్ చేశాడు. కెరీర్లో 1,068 సింగిల్ మ్యాచ్ విజయాలతో నాదల్‌ను దాటేశాడు. అంతేకాదండోయ్.. ఈ ఘనత సాధించిన మూడో టెన్నిస్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
ఈ ట్రోఫీ విజయంతో లెజెండరీ ఆటగాళ్లు రోజర్ ఫెదరర్(Roger Federer), జిమ్మీ కోనర్స్(jimmy connors) సరసన నిలిచాడు. జకోకు ఇది 3వ సిన్సినాటి ఓపెన్ టైటిల్. మొత్తంగా చూస్తే 39వ మాస్టర్స్ 1000 టైటిల్ కావడం విశేషం. మ్యాచ్ గెలిచిన అనంతరం ఈ స్టార్ ఆటగాడు ఉద్వేగానికి లోనయ్యాడు. సంతోషం పట్టలేక చొక్కా చింపేసుకున్నాడు.
Forever a FIGHTER#CincyTennis | @DjokerNole pic.twitter.com/Si2ybIqrQC
— Western & Southern Open (@CincyTennis) August 21, 2023
నిన్న జరిగిన ఫైనల్లో జకోవిచ్ టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)ను ఓడించాడు. దాంతో, నెలక్రితం వింబుల్డన్ ఓపెన్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. నాలుగ్గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 5-7, 7-6 (9/7), 7-6 (7/4)తో అల్కరాజ్పై గెలుపొందాడు. టాప్ సీడ్స్ హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్‌కు రికార్డు సొంతం చేసుకుంది. మాస్టర్స్ 1000 టోర్నమెంట్లో సుదీర్ఘం సమయం జరిగిన మూడో ఫైనల్‌గా నిలిచింది.
అల్కరాజ్, నొవాక్ జకోవిచ్
ఈ ఏడాది గాయం నుంచి కోలుకున్న తర్వాత జకో మరింత దూకుడుగా ఆడుతున్నాడు. వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. అదే ఊపులో వింబుల్డన్ టైటిల్ నెగ్గాలనుకున్న అతడికి అల్కారాజ్ చెక్ పెట్టాడు. దాంతో, 8వ వింబుల్డన్ ట్రోఫీ చేజారింది. ఆ ఓటమి నుంచి తేరుకున్న జకో మళ్లీ విజయాల బాట పట్టాడు. సిన్సినాటి ఓపెన్ టైటిల్‌తో సత్తా చాటాడు.