Novak Djokovic | నేను వాక్సీన్‌కు వ్యతిరేకం కాదు.. నా ఉద్దేశం ఏంటంటే..? : జకోవిచ్
Novak Djokovic : యూఎస్ ఓపెన్(US Open) చాంపియన్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్‌తో సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో పీట్ సాంప్రాస్(Peet Sampras), రోజర్ ఫెదరర్(Rojer Federer) వంటి దిగ్గజ ఆటగాళ్లకు సాధ్యంకాని రికార్డు సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ అనంతంరం ఈ స్టార్ ప్లేయర్ ఏడాది కిందటి వాక్సీన్ వివాదం(Vaccine Dispute)పై ఆసక్తికర....
Novak Djokovic : యూఎస్ ఓపెన్(US Open) చాంపియన్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్‌తో సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో పీట్ సాంప్రాస్(Peet Sampras), రోజర్ ఫెదరర్(Rojer Federer) వంటి దిగ్గజ ఆటగాళ్లకు సాధ్యంకాని రికార్డు సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతంరం ఈ స్టార్ ప్లేయర్ ఏడాది కిందటి వాక్సీన్ వివాదం(Vaccine Dispute)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను వ్యాక్సిన్‌కు వ్యతిరేకం కాదు. అయితే.. ఏ విషయంలోనైనా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని నమ్ముతాను. కానీ, అందరికి అలాంటి చాన్స్ ఉంటుందని నేను అనుకోవడం లేదు. ప్రతిరోజు మా దేశంలో, ప్రపంచవ్యాప్తంగా అలాంటి మనుషులను చాలామందిని చూస్తాను’ అని జకోవిచ్ అన్నాడు.
అంతేకాదు రికార్డు స్థాయిలో 24 గ్రాండ్‌స్లామ్స్ గెలవడంపై కూడా ఈ సెర్బియా స్టార్ స్పందించాడు. ‘మీ అందరి ముందు ఇక్కడ నిల్చుంటానని, కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గుతానని కలలో కూడా ఊహించలేదు. ఇది అసలు సాధ్యం అవుతుందని కూడా అనుకోలేదు. కానీ, ఈ రెండేళ్లలో నేను ఈ రికార్డు సృష్టించగలనని నమ్మాను.
That’s a lot of hardware. 🤯 pic.twitter.com/eRPA0vxNMl
— US Open Tennis (@usopen) September 11, 2023
చరిత్రకు అడుగు దూరంలోనే ఉన్నాను. మరి అలాంటప్పుడు ఎందుకు ఆ చాన్స్‌ను వదులుకోవాలి అని అనుకున్నా’ అని జకోవిచ్ వెల్లడించాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్ రష్యాకు చెందిన డానిల్ మెద్వెదేవ్(Daniil Medvedev)ను చిత్తుగా ఓడించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబరిచిన జకో 6-3, 7-6 (7-5), 6-3తో గెలుపొందాడు.
ఫ్రెంచ్ ఓపెన్‌తో…
నిరుడు కరోనా వాక్సిన్ వేసుకోకపోవడంతో జకోవిచ్ వార్తల్లో నిలిచాడు. వాక్సిన్ నిబంధనల కారణంగా యూఎస్ ఓపెన్(US Open 2022) నిర్వాహకులు అతడిని అనుమతించలేదు. దాంతో, నిరాశగా స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నుంచి కూడా జకో వైదొలిగాడు. అయితే.. వాక్సిన్ తప్పనిసరి అనే నిబంధనల్ని సడలించడంతో జకోవిచ్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడాడు. ఆ తర్వాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)ను ఓడించాడు. దాంతో, కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్(22 గ్రాండ్‌స్లామ్స్) రికార్డును బ్రేక్ చేశాడు.
ఇవి కూడా చదవండి
Virat Kohli | బంగ్లాతో మ్యాచ్‌లో డ్రింక్స్ మోసుకెళ్లిన కోహ్లీ.. వీడియో చూశారా..!
Asia Cup: పాకిస్థాన్ 252/7.. శ్రీలంక 252/8.. కానీ శ్రీలంక ఎలా గెలిచింది?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

