Davis Cup | నోరీపై జకోవిచ్ విజయం.. డేవిస్ కప్ సెమీ ఫైనల్లో సెర్బియా
Davis Cup : ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్(Davis Cup)లో వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. స్పెయిన్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్‌కు చెందిన కామెరూన్ నోరీ(Cameron Norrie)పై గెలుపొందాడు. ఏకపక్ష పోరులో జకో 6-4, 6-4తో నోరీని...
Davis Cup : ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్(Davis Cup)లో వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. స్పెయిన్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్‌కు చెందిన కామెరూన్ నోరీ(Cameron Norrie)పై గెలుపొందాడు. ఏకపక్ష పోరులో జకో 6-4, 6-4తో నోరీని చిత్తు చేశాడు. సింగిల్స్‌లో ఈ స్టార్ ప్లేయర్‌కు ఇది వరుసగా 21వ విజయం.
దాంతో, బ్రిటన్ 2-0 ఆధిక్యంతో సెర్బియా జట్టు డేవిస్ కప్ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ మూడేండ్లలో ఆ జట్టుకు ఇది రెండో సెమీస్ కావడం విశేషం. మరోవిషయం ఏంటంటే..? జకోకు ఈ టోర్నీలో ఇది 44వ విజయం.తద్వారా డేవిస్ కప్ చరిత్రలో విజయవంతమైన సెర్బియా ఆటగాడిగా జకో గుర్తింపు సాధించాడు. తదుపరి మ్యాచ్‌లో సెర్బియా.. జన్నిక్ సిన్నర్ నేతృత్వంలోని ఇటలీతో తలపడనుంది.
ఏటీపీ ఫైనల్స్ ట్రోఫీతో జకోవిచ్

దేశం తరఫున ఆడడం ఎల్లప్పుడూ కొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సుదీర్ఘ టోర్నీలో మేము మంచి స్థితిలో ఉన్నాం. తర్వాత ఇటలీతో ఆడనున్నాడు. ఆ జట్టు బలమైనది. అయినా సరే గెలుపుకోసం మేము కోర్టులో సర్వశక్తులూ ఒడ్డుతాం అని మ్యాచ్ అనంతరం జకోవిచ్ తెలిపాడు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 2-1తో ఇటలీ గెలుపొందింది. ఈ వారంలోనే జరిగిన ఏటీపీ ఫైనల్స్‌లో జకోవిచ్, సిన్నర్ ఎదురుపడ్డారు. రెండు సెట్లలో ఆధిపత్యం చెలాయించిన జకో.. రికార్డు స్థాయిలో 7వసారి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
-
Raj Kumar Kohli | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సినీ నిర్మాత మృతి
-
Hyderabad | పెట్టుబడులకు కేరాఫ్ ఓఆర్ఆర్.. కోర్‌సిటీని మించి ఔటర్ చుట్టూ అభివృద్ధి
-
Rohit Sharma Daughter | ‘మా డాడీ మళ్లీ నవ్వుతాడు’.. హిట్‌మ్యాన్ కూతురు వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

