Hyderabad | పెట్టుబడులకు కేరాఫ్ ఓఆర్ఆర్.. కోర్‌సిటీని మించి ఔటర్ చుట్టూ అభివృద్ధి
Hyderabad | ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది. కోర్‌సిటీని మించి ఓఆర్ఆర్ చుట్టూ అభివృద్ధి జరుగుతున్నది. భారీ ప్రాజెక్టులు, ఆకాశహర్మ్యాలు, అంతర్జాతీయ కంపెనీలతో ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి.
Hyderabad | ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది. కోర్‌సిటీని మించి ఓఆర్ఆర్ చుట్టూ అభివృద్ధి జరుగుతున్నది. భారీ ప్రాజెక్టులు, ఆకాశహర్మ్యాలు, అంతర్జాతీయ కంపెనీలతో ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. 10-59 అంతస్థుల వరకు ఎత్తయిన ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నాయి. ఇంటర్‌చేంజ్‌ల నుంచి కోర్ సిటీ, జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ర్టాల నుంచి రాకపోకలు అత్యంత సులభంగా సాగించేలా ప్రభుత్వం రోడ్ల నిర్మాణం చేపడుతుండటంతో, ఆ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా నగరాభివృద్ధి పరుగులు పెడుతున్నది. మణిహారంలా మారిన 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ చుట్టూ భూములు అందుబాటులో ఉండటంతో ప్రైవేటు కంపెనీలు భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం ఓఆర్ఆర్ నుంచి కోర్ సిటీకి రోడ్లను అనుసంధానం చేసింది. పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్‌తో పాటు నలుదిక్కులా కొత్త ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకున్నది. దీంతో నివాస, వ్యాపార సముదాయాలతో పాటు ఫార్మా, లైఫ్‌సైన్సెస్, డిఫెన్స్, ఏరోస్పేస్, వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహన రంగాలకు చెందిన పరిశ్రమలు ఔటర్ చుట్టూ భారీగా ఏర్పాటయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న నగరం, అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఓఆర్ఆర్ చుట్టూ మరో మూడుచోట్ల (నార్సింగి, కోకాపేట, మల్లంపేట) ఇంటర్‌చేంజ్‌లను నిర్మించింది. ప్రభుత్వ చర్యలతో మహేశ్వరం, తుక్కుగూడ, కొంగరకలాన్ ప్రాంతాల్లో ఫ్యాబ్ సిటీ, ఈ-సిటీ వంటివి రాగా, ముచ్చర్ల సమీపంలో దేశంలోనే అతి పెద్దదైన ఫార్మాసిటీ నిర్మాణం జరుగుతున్నది.
…? శేఖర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

