Dinesh Karthik: ఐపీఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన దినేశ్ కార్తీక్
Dinesh Karthik: దినేశ్ కార్తీక ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ఆ టోర్నీ బ్రాడ్‌కాస్టర్ జియోసినిమా తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నది. ఆర్సీబీ తరుపున దినేశ్ ఈ సీజన్లో ఆడాడు. ఐపీఎల్ కెరీర్లో అతను మొత్తం 257 మ్యాచ్‌లు ఆడి 4842 రన్స్ చేశాడు.
అహ్మాదాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాటర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik).. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అతనికి చివరిది. ఇదే తన చివరి ఐపీఎల్ అని చెప్పిన కార్తీక్‌కు .. నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత తోటి ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. నిజానికి రిటైర్మెంట్ అంశాన్ని దినేశ్ కార్తీక్ సూటిగా చెప్పకపోయినా.. లీగ్‌ను ప్రసారం చేస్తున్న సంస్థ మాత్రం అతని రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దినేశ్ 16 ఏళ్ళ క్రితం టీ20 లీగ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ ఫార్మాట్లో అత్యుద్భుత ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్‌కు గుర్తింపు ఉన్నది.
1⃣ #TATAIPL 🏆
2⃣nd – most dismissals by a WK in #IPL 💪
3⃣rd – most appearances in the league’s history! 🤯#IPLonJioCinema #RRvRCB #DineshKarthik #TATAIPLPlayoffs pic.twitter.com/dXYJz6skOi— JioCinema (@JioCinema) May 22, 2024
ఐపీఎల్ డిజిటల్ బ్రాడ్‌కాస్టర్.. జియో సినిమా తన సోషల్ మీడియా పోస్టులో ఆర్సీబీ వికెట్ కీపర్‌కు నివాళి అర్పించింది. చేతి గ్లౌజ్‌లను తీసి .. ఆర్సీబీ క్రికెటర్లు, అభిమానుల వైపు కార్తీక్ చూపించాడు. స్టేడియం చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశాడు. భావోద్వేగానికి లోనవుతున్న కార్తీక్‌ను.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హత్తుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వద్ద .. కార్తీక్‌కు ఆర్సీబీ క్రికెటర్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.
కార్తీక్ తన ఐపీఎల్ కెరీర్లో 257 మ్యాచ్‌లు ఆడి 4842 రన్స్ చేశాడు. దీంట్లో 22 ఫిఫ్టీలు ఉన్నాయి. 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో అతను ఆరు ఫ్రాంచైజీల తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2008 తొలి ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున అతను అరంగేట్రం చేశాడు. 2011లో పంజాబ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ తరపున ఆడాడు.
From #RCB to Dinesh Karthik ❤️ #TATAIPL | #RRvRCB | #TheFinalCall | #Eliminator | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/p2XI7A1Ta6
— IndianPremierLeague (@IPL) May 22, 2024
ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచుల్లో అతను 326 రన్స్ చేశాడు. 36.22 సగటుతో అతను బ్యాటింగ్ చేశాడు. స్ట్రయిక్ రేటు 187.36గా ఉన్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

