గాలె: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నది. సహచరులు విఫలమైన చోట సీనియర్ బ్యాటర్ దినేశ్ చండిమల్(118 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తాచాటాడు. ఓవర్‌నైట్ స్కోరు 184/2తో మూడో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 431/6 స్కోరు చేసింది. ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిని సమర్థంగా తిప్పికొడుతూ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. నాలుగో వికెట్‌కు మాథ్యూస్‌తో 83 పరుగులు, మెండిస్‌తో 133 పరుగులు జత చేసి లంకకు భారీ స్కోరు కట్టబెట్టాడు.