Prithvi Shaw | పృథ్వీ షా ఎవరో నాకు తెలియదు.. సెల్ఫీ వివాదం కేసులో కోర్టుకు తెలిపిన సప్నా గిల్..!
క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw)పై దాడి చేసి అతని కారును ధ్వంసం చేసిన కేసులో అరెస్టయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ (Social media influence), భోజ్పురి (Bhojpuri actress) నటి సప్నా గిల్ (Sapna Gill)ను శనివారం కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పృథ్వీ షా ఎవరో తనకు తెలియదని సప్నా గిల్ కోర్టుకు తెలిపింది.
Prithvi Shaw | క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw)పై దాడి చేసి అతని కారును ధ్వంసం చేసిన కేసులో
అరెస్టయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ (Social media influence), భోజ్పురి (Bhojpuri actress) నటి సప్నా గిల్ (Sapna Gill)ను శనివారం కోర్టు ముందు హాజరుపరిచారు. అంధేరీ కోర్టు (Andheri court) ఆమెకు ఫిబ్రవరి 20వ తేదీ వరకు పోలీసు కస్టడీ విధించింది. ఈ సందర్భంగా పృథ్వీ షా ఎవరో తనకు తెలియదని సప్నా గిల్ కోర్టుకు తెలిపింది.
‘పృథ్వీ షాను నా స్నేహితుడు శోభిత్ ఠాకూర్ సెల్ఫీ అడిగాడు. పృథ్వీ షా ఎవరో నాకు తెలియదు. అతను
క్రికెటర్ అని కూడా తెలియదు. మేము ఇద్దరమే ఉన్నాం. పృథ్వీ షాతో పాటు ఎనిమిది మంది స్నేహితులు
ఉన్నారు. ఆ సమయంలో పృథ్వీ షా తాగి ఉన్నారు’ అని సప్నా గిల్ కోర్టుకు తెలిపింది.
మరోవైపు కోర్టులో సప్నా గిల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పృథ్వీ షాకు మద్యం అలవాటు
ఉందని.. అందుకే బీసీసీఐ(BCCI) అతనిపై నిషేధం విధించిందని మీడియాలో వచ్చిన కథనాలను కోర్టు
ముందు ఉంచారు. అదేవిధంగా పృథ్వీ నుంచి సప్నా గిల్ రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు వస్తున్న
ఆరోపణలను న్యాయవాది ఖండించారు. రూ.50 వేలు ఇవ్వాలంటూ తన క్లయింట్ సప్నాగిల్ బెదిరించినట్లు
పృథ్వీ షా బృందం చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఘటన జరిగిన 15 గంటల తర్వాత పృథ్వీ షా స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది చెప్పారు. వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

