ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. చేతన్ సకారియా వేసిన 14వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడబోయిన రాయుడు(27) సూపర్ కవర్లో పరాగ్ చేతికి చిక్కాడు. అదే ఓవర్లో రైనా(18) కూడా క్రిస్ మోరీస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అంతకుముందు సురేశ్ రైనా, అంబటి రాయుడు నిలకడగా ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదేశారు. రియాన్ పరాగ్ వేసిన 11వ ఓవర్లో రాయుడు, రైనా చెరో సిక్స్ కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. రాహుల్ తెవాటియా వేసిన ఆ తర్వాతి ఓవర్లో రాయుడు వరుసగా రెండు సిక్సర్లు బాది 14 రన్స్ రాబట్టాడు. దీంతో 12 ఓవర్లకే చెన్నై స్కోరు 100 దాటింది. 14 ఓవర్లకు చెన్నై 5 వికెట్లకు 125 పరుగులు చేసింది. ప్రస్తుతం ధోనీ, జడేజా క్రీజులో ఉన్నారు.
Another catch taken successfully by @ParagRiyan as Ambati Rayudu departs.#CSK lose their 4th wicket.
— IndianPremierLeague (@IPL) April 19, 2021
Live – https://t.co/vRHaGGSTjJ #CSKvRR #VIVOIPL pic.twitter.com/pQCgEYgkNY