హైదరాబాద్, ఆట ప్రతినిధి: 67వ నేషనల్ చాంపియన్షిప్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో హైదరాబాదీ షూటర్ ధనుష్ శ్రీకాంత్ రజతంతో మెరిశాడు. భోపాల్లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన శాహు తుషార్ మనె స్వర్ణం సాధించగా..
కొద్దిపాటి తేడాతో ధనుష్ రెండో స్థానంలో నిలిచాడు. ఫైనల్లో తుషార్ 10.1 పాయింట్లు సాధించగా ధనుశ్ 9.8తో రజతం సాధించాడు.