BCCI | వైభవ్ అద్భుతమైన క్రికెటర్.. అతడి భవిష్యత్తుకు మాది పూచీ..!
BCCI : ఐపీఎల్ 19వ సీజన్లో చితక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) భవితవ్యం ఏంటీ?.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఇదే చర్చ. ఈ కుర్రాడిని మరింత రాటుదేల్చడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి దృష్టి సారిస్తోంది.
BCCI : ఐపీఎల్ 19వ సీజన్లో చితక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) భవితవ్యం ఏంటీ?.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఇదే చర్చ. 15 ఏళ్లకే సంచలన ఆటతో దిగ్గజాలను ఆశ్చర్యపరుస్తున్న వైభవ్‌ను త్వరలోనే సీనియర్ జట్టుకు ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుర్రాడిని మరింత రాటుదేల్చడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దృష్టి సారిస్తోంది. రెండోసారి విజేత ఆర్సీబీ జట్టుకు ట్రోఫీ బహకరణ అనంతరం కార్యదర్శి దేవజిత్ సైకియా (Devjit Saikia) మాట్లాడుతూ వైభవ్ భవితకు పూచీ మాది అని చెప్పాడు.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో రికార్డుల మోత మోగించిన వైభవ్ సూర్యవంశీ పలు అవార్డులు పట్టేశాడు. ఏకంగా ఐదు పురస్కారాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు ‘నేను రెఢీ’ అనే సంకేతాలిచ్చాడీ కుర్రాడు. భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్‌లు వైభవ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేయగా.. బీసీసీఐ సైతం ఆ దిశగా ఆలోచిస్తోంది.
“Vaibhav Sooryavanshi is a wonderful player coming up, and he has a bright future. BCCI will do everything to get him to the highest level of cricket..”
~ BCCI Secretary Devajit Saikia pic.twitter.com/XvZmwXt6Aj
— Cricketopia (@CricketopiaCom) June 1, 2026
ఐపీఎల్ 19వ సీజన్ ఫైనల్ అనంతరం దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ’19వ సీజన్ అద్భుతంగా సాగింది. అభిమానులు ఎంతో ఆస్వాదించారనుకుంటున్నా. వరసగా రెండోసారి విజేతగా నిలిచిన ఆర్సీబీకి శుభాకాంక్షలు. వైభవ్ విషయానికొస్తే.. అతడు అద్భుతమైన క్రికెటర్. అతడికి ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. భారత క్రికెట్లో అతడు ఉన్నత శిఖరాలు చేరడానికి బీసీసీఐ అన్ని విధాల సహకరిస్తుంది’ అని సైకియా తెలిపాడు. దాంతో.. వైభవ్‌ను త్వరలోనే సీనియర్ జట్టులోకి తీసుకోవడం ఖాయమని పలువురు అంటున్నారు.
#WATCH | Ahmedabad, Gujarat: On the Royal Challengers Bengaluru defeating the Gujarat Titans by 5 wickets in the Indian Premier League, BCCI secretary Devajit Saikia says, “It was a wonderful season… I hope all the fans have a lovely time during this IPL, and congratulations to… pic.twitter.com/XQwREerg7M
— ANI (@ANI) May 31, 2026
అదిరే ఆటకు 5 అవార్డులు
రంజీల్లో 13 ఏళ్లకే అరంగేట్రం చేసిన వైభవ్ తాను ఆడిన ఐపీఎల్ (18వ ఎడిషన్) తొలి సీజన్లోనే 35 బంతుల్లో శతకంతో రికార్డు నెలకొల్పాడు. రెండో సీజన్లోనూ తనమార్క్ విధ్వంసంతో ప్రపంచస్థాయి బౌలర్లకు చుక్కలు చూపించాడీ పదిహేనేళ్ల కుర్రాడు.

లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 37 బంతుల్లోనే వంద కొట్టిన ఈ చిచ్చరపిడుగు.. ఎలిమినేటర్‌లో 97, క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌పై 96 రన్స్‌తో రెచ్చిపోయాడు. మొత్తంగా 776 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ తన్నుకుపోయిన వైభవ్.. అత్యంత విలువైన ఆటగాడు, వర్ధమాన ఆటగాడు, సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డులు కొల్లగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

