NZW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా రెండు ఓటములు చవిచూసిన న్యూజిలాండ్ (Newzealand) మరోసారి బ్యాటింగ్‌లో విఫలమైంది. బంగ్లాదేశ్ బౌలర్లను ఎదుర్కొలేక టాపార్డర్ కుప్పకూలగా.. బ్రూక్ హల్లిడే (69) కెప్టెన్ సోఫీ డెవినె (63) అర్ధ శతకాలతో రాణించారు. దాంతో.. 2230 వరకూ కొట్టేలా కనిపించింది వైట్ ఫెర్న్స్. కానీ, డెత్ ఓవర్లలో బంగ్లా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్ల వేట కొనసాగించారు. దాంతో.. నిర్ణీత ఓవర్లలో కివీస్ 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను వణికించిన బంగ్లా బౌలర్లు ఈసారి న్యూజిలాండ్ బ్యాటర్లను హడలెత్తించారు. దాంతో.. బోణీ కోసం నిరీక్షిస్తున్న కివీస్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. గువాహటి స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు శుభారభం లభించలేదు. ఫామ్‌లోలేని ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్(4)ను రబేయా ఖాన్ ఔట్ చేసింది. ఆ తర్వాత సుజీ బేట్స్(29) సైతం నిరాశపరచగా.. అమేలియా కేర్ ఒక్క పరుగుకే బౌల్డ్ అయింది. దాంతో.. 38 కే మూడు వికెట్లు పడ్డాయి.
New Zealand Women have posted a decent total of 227/9 in their 50 overs
Can they defend it?#SophieDevine #brookehalliday #RabeyaKhan #NZvBAN #NZvsBAN #NZWvBANW #NZWvsBANW #newzealandcricket #BangladeshCricket #BangladeshCricketTeam #NewZealandCricketTeam #WomensWorldcup2025… pic.twitter.com/kXtaD48bA6
— SBM Cricket (@Sbettingmarkets) October 10, 2025
ఆ దశలో క్రీజులోకి వచ్చిన బ్రూక్ హల్లిడే (69) సమయోచితంగా ఆడింది. కెప్టెన్ సోఫీ డెవినె (63)తో కలిసి బ్రూక్.. సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఎట్టకేలకు ఫాహిమా ఖాతూన్ విడదీసింది. జోరుమీదున్న హల్లిడేను ఆమె స్లో బాల్‌తో బోల్తా కొట్టించింది. క్యాచ్ అందుకోవడంతో నాలుగో వికెట్ 112 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికీ వైట్ ఫెర్న్స్ స్కోర్.. 150.
హల్లిడే వికెట్ పడడంతో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించే బాధ్యత తీసుకుంది డెవెనె. రబెయా వేసిన ఓవర్లో గేర్ మార్చిన డెవినె వరుసగా రెండు సిక్సర్లు బాదింది. కానీ, తర్వాతి బంతిని సిక్సర్ కొట్టబోయి బౌల్డయ్యింది. దూకుడుగా ఆడే క్రమంలో మ్యాడీ గ్రీన్ (25) స్టంపౌట్ కాగా.. కివీస్ స్కోర్ 220-230 చేరడం గగనం అనిపించింది. అయితే.. ఆఖర్లో వికెట్ కీపర్ ఇసబెల్లా గేజ్ (12), లీ తహుహు(12 నాటౌట్) పోరాటంతో న్యూజిలాండ్ గౌరప్రదమైన స్కోర్ చేసింది. మరుఫా అక్తర్ వేసిన 50వ ఓవర్లో గేజ్ సిక్స్, ఫోర్ బాదడంతో కివీస్.. నిర్ణీత ఓవర్లలో 227 పరుగులు చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో రబెయా ఖాన్ మూడు వికెట్లు తీసింది.