IPL 2024 | బ్యాటర్ కాదు బెంబేలెత్తించే బౌలర్.. ఢిల్లీ కొత్త అస్త్రం ఇతడే..!
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) రికార్డు స్కోర్లకు కేరాఫ్ అవుతోంది. ఐదింటా నాలుగు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ బౌలింగ్ యూనిట్లో కొత్త అస్త్రాన్ని ప్రయోగించనుంది. తాజాగా ఢిల్లీ ఫ్రాంచైజీ దక్షిణాఫ్రికా..
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) రికార్డు స్కోర్లకు కేరాఫ్ అవుతోంది. పేలవమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్ల ఊచకోతకు పంత్ సేన బలవుతోంది. ఐదింటా నాలుగు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ బౌలింగ్ యూనిట్లో కొత్త అస్త్రాన్ని ప్రయోగించనుంది. తాజాగా ఢిల్లీ ఫ్రాంచైజీ దక్షిణాఫ్రికా యువ పేసర్‌ను తీసుకుంది.
మెగా టోర్నీ నుంచి వైదొలిగిన విధ్వంసక ఆటగాడు హ్యారీ బ్రూక్(Harry Brook) స్థానంలో లిజాడ్ విలియమ్స్ (Lizaad Williams)తో ఒప్పందం చేసుకుంది. 30 ఏండ్ల ఈ స్పీడ్‌స్టర్ త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. లిజాడ్ ఇప్పటివరకూ 11 టీ20లు ఆడాడంతే. ఈ కుర్ర పేర్కు రెండు టెస్టులు, నాలుగు వన్డేల అనుభవం ఉంది.
🚨 Announcement 🚨
The 🇿🇦 speedster, Lizaad Williams is all set to ROAR for us this season 🙌
He comes into our squad as a replacement for 🏴’s Harry Brook ↩️
#YehHaiNayiDilli #IPL2024 pic.twitter.com/0HgHi67ZLQ— Delhi Capitals (@DelhiCapitals) April 8, 2024
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 230కి పైచిలుకు లక్ష్య ఛేదనలో ఢిల్లీ చేతులెత్తేసింది. ట్రిస్టన్ స్టబ్స్(71), పృథ్వీ షా(66)లు హాఫ్ సెంచరీతో చెలరేగినా ముంబై ఇండియన్స్‌నే విజయం వరించింది. హ్యాట్రిక్ ఓటమి నుంచి తప్పించుకుంటుందా? లేదా? అనేది చూడాలి. ఏప్రిల్ 12వ తేదీన జరిగే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
Stubbs and Shaw stood tall 🙌#YehHaiNayiDilli #IPL2024 #MIvDC pic.twitter.com/SaHBSgzuFG
— Delhi Capitals (@DelhiCapitals) April 7, 2024
ఇవి కూడా చదవండి
- IPL 2024 | ‘డిఫెన్స్ మినిస్టర్’ రాహుల్.. ‘ఔను నిజమే’ అంటున్న ఫ్యాన్స్
- Data Breach | 75 లక్షల మంది బోట్ యూజర్ల వ్యక్తిగత సమాచారం లీక్
- Staff nurse | సరూర్‌నగర్‌లో స్టాఫ్ నర్స్ ఆత్మహత్య
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

