DC vs MI | డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు తొలి మ్యాచ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ గెలిచింది. 18.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఢిల్లీ 179 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై.. 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లు పూర్తికాకముందే ముంబైని ఓడించింది.
ఢిల్లీని లలిత్ యాదవ్ ఆదుకున్నాడు. 38 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఆ తర్వాత అక్సర్ పటేల్ 38, పృథ్వీ షా 38 పరుగులు చేశారు. శార్దూల్ ఠాకూర్ 22 పరుగులు, టిమ్ 21 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బాసిల్ థంపి 3 వికెట్లు, మురుగన్ అశ్విన్ 2 వికెట్లు, టైమల్ మిల్స్ ఒక వికెట్ తీశాడు.
WHAT. A. CHASE. 🔥🔥@DelhiCapitals register their first victory of the season in style!
Scorecard – https://t.co/WRXqoHz83y #TATAIPL #DCvMI pic.twitter.com/prGmdPTAaN
— IndianPremierLeague (@IPL) March 27, 2022