INDW vs SAW : వన్డే ప్రపంచ కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ సాగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత స్పిన్నర్ల విజృంభణతో ఓటమి దిశగా సాగిన సఫారీ జట్టును కెప్టెన్ లారా వొల్వార్డ్త్(70) ఆదుకోగా.. ఆఖర్లో డీక్లెర్క్ (84 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్‌తో గెలిపించింది. అమన్‌జోత్ వేసిన 49వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో దక్షిణాఫ్రికా చిరస్మరణీయ విజయం సాధించింది.
తొలి వరల్డ్ కప్ వేటలో ఉన్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా ఝలక్ ఇచ్చింది. రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న టీమిండియాను ఉత్కంఠ పోరులో ఓడించింది. రీచా ఘోష్ మెరుపులతో భారీ స్కోర్ చేసిన భారత్‌కు స్పిన్నర్ల విజృంభణతో విజయంపై ఆశలు చిగురించాయి. కానీ.. అసమాన పోరాటంతో సఫారీలను గెలిపించింది డీక్లెర్క్(84 నాటౌట్) .
An absolute cracker of a chase by South Africa after having their backs to the wall at 142 for 6 🔥 They remain undefeated against India in ODI World Cups 💯
SCORECARD ▶️ https://t.co/LFct1SLX3V | #CWC25 | #INDvSA pic.twitter.com/sKPa2Dn4JX
— ESPNcricinfo (@ESPNcricinfo) October 9, 2025
ఛేదనలో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఒకే రన్ ఇచ్చిన క్రాంతి గౌడ్ తన రెండో ఓవర్లోనే బ్రేకిచ్చింది.న్యూజిలాండ్‌పై సెంచరీతో సఫారీలను గెలిపించిన తంజిమ్ బ్రిట్స్(0) వికెట్ పడగొట్టిందీ పేసర్. బ్రిట్స్ స్ట్రెయిట్‌గా ఆడిన బంతిని గ ఒడుపుగా ఎడమచేత్తో క్యాచ్ అందుకుంది. ఆ తర్వాత గత మ్యాచ్‌లో అజేయంగా నిలిచిన సునే లుస్(5)ను అమన్‌జోత్ ఔట్ చేసింది. వరసుగా రెండు వికెట్లు పడిన జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది మరినే కాప్(20). కెప్టెన్ లారా వొల్వార్డ్త్(70)తో కలిసి స్కోర్‌బోర్డును నడిపించింది. కానీ, స్నేహ్ రానా ఆమెను క్లీన్ బౌల్డ్ చేసి సఫారీలను కష్టాల్లోకి నెట్టింది.
India finally break the South Africa captain’s resistance
LIVE ▶️ https://t.co/LFct1SLX3V | #CWC25 | #INDvSA pic.twitter.com/40z7bB44GX
— ESPNcricinfo (@ESPNcricinfo) October 9, 2025
ఆ తర్వాతి ఓవర్లో అన్నెకె బాస్చ్ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చింది దీప్తి శర్మ. అనంతరం దూకుడుగా ఆడబోయిన సినాలో జఫ్తా(14)ను శ్రీచరణి ఎల్బీగా ఔట్ చేసి ఐదో వికెట్ అందించింది. 81కే సగం వికెట్లు పడిన వేళ.. చోలే ట్రయాన్ (49).. 61 రన్స్ జోడించిన లారాను బౌల్డ్ చేసి సఫారీల ఓటమిని ఖాయం చేసింది క్రాంతి., కానీ. ట్రయాన్, డిక్లెర్క్ ధనాధన్ ఆడుతూ సఫారీలను గెలుపు దిశగా నడిపారు. రానా వేసిన 46వ ఓవర్లో డీక్లెర్క్ వరుసగా 6, 4 బాదగా.. ఐదో బంతికి ట్రయాన్ ఎల్బీగా ఔట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మళ్లింది. కానీ, గౌడ్ ఓవర్లో డీక్లెర్క్ 6, 6, 4 కొట్టడంతో మ్యాచ్ మళ్లీ సఫారీ వైపు తిరిగింది. అమన్‌జోత్ ఓవర్లో డీక్లెర్క్ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో 3 వికెట్ల తేడాతో జయ భేరిమోగించింది.
వరల్డ్ కప్‌లో చెలరేగిపోతున్న రీచా ఘోష్ (94) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడింది. వైజాగ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ల ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ చేతులెత్తేయగా.. ఒంటిచేత్తో జట్టుకు భారీ స్కోర్ అందించింది. ఫినిషర్ పాత్రను పోషిస్తూ సఫారీ బౌలర్లను హడలెత్తించిన రీచా.. డెత్ ఓవర్లలో దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపింది. 153కే ఏడు వికెట్లు పడిన దశలో ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా అమన్‌జోత్ కౌర్ అండగా 51 పరుగులు, రానాతో ఎనిమిదో వికెట్‌కు విలువైన 88 రన్స్ జోడించింది. ఆఖరి ఓవర్ వరకూ సాగిన ఆమె ఊచకోత కారణంగా భారత జట్టు 251 పరుగులు చేయగలిగింది.