Euro Cup | హాంబర్గ్: యూరో కప్-2024లో డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ బోణీ కొట్టింది. హాంబర్గ్ (జర్మనీ) వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 2-1తో అల్బేనియను ఓడించింది. ఇరు జట్ల మధ్య హోరాహోరిగా సాగిన పోరులో అల్బేనియా తరఫున ఆట తొలి నిమిషంలోనే నెడిమ్ బజ్రామి గోల్ చేసినా ఆ తర్వాత ఇటలీ పుంజుకుంది.
అలెస్సండ్రొ బస్తోని (11వ నిమిషంలో), నికొలొ బరెల్ల (16వ) గోల్స్ సాధించారు. మరో పోరులో నెదర్లాండ్స్.. 2-1తో పోలండ్పై గెలిచింది. ఆడమ్ బుకస 16వ నిమిషంలో పోలండ్‌కు ఏకైక గోల్ చేయగా డచ్ జట్టుకు గక్పొ తొలి గోల్ అందించాడు. ఆట మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా 83వ నిమిషంలో వెఘొ ర్స్ గోల్ చేసి నెదర్లాండ్స్‌కు విజయాన్ని అందించాడు.