Under -19 World Cup Final : అండర్-19 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. భారీ ఛేదనలో ఆదిలోనే ఓపెనర్ జోసెఫ్ మూరేస్(17)ను క్లీన్‌బౌల్డ్ చేసిన అంబ్రిష్ అదిరే బ్రేకివ్వగా.. మిడిల్ ఓవర్లలో కెప్టెన్ ఆయుష్ మాత్రే(1-3) మ్యాజిక్ చేశాడు. అర్ధ శతకంతో జోరు మీదున్న డాసన్(66)ను అతడు వెనక్కి పంపాడు. అదే ఓవర్లో రాల్ఫీ ఆల్పర్ట్(0)ను వైభవ్ సూర్యవంశీ మెరుపు త్రోతో రనౌట్ చేశాడు. దాంతో.. 174కే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్. మరో మూడు పరుగుల వ్యవధిలోనే ఏడో వికెట్ కూడా ఇచ్చేసింది.
భారీ ఛేదనలో ఇంగ్లండ్‌కు ఐదో ఓవర్లోనే అంబ్రిష్ షాకిచ్చాడు. ఓపెనర్ జోసెఫ్ మూరెస్(17)ను బౌల్డ్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చాడు. అనంతరం బెన్ మేయ్స్(45) జతగా బెన్ డాకిన్స్(66) బౌండరీలతో చెలరేగాడు. అర్ధ శతకానికి చేరువైన.. బెన్ స్వీప్ షాట్ ఆడిన హెనిల్ పటేల్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు.
Ambrish R.S. and Khilan Patel with the wickets for India U19 so far ☝️☝️
England U19 are 130/2 after 17 overs.
Updates ▶️ https://t.co/hisult6ODX #U19WorldCup pic.twitter.com/L8S3hpKIgN
— BCCI (@BCCI) February 6, 2026
ఓవైపు వికెట్లు పడుతున్నా క్రీజులో పాతుకుపోయిన డాకిన్స్ను ఆయుష్ మాత్రే బోల్తా కొట్టించాడు. రాల్ఫీ ఆల్బర్ట్(0) క్రీజులోకి రావడమే ఆలస్యం రనౌటయ్యాడు. కవర్స్‌లో ఆడిన బంతిని ఆపిన వైభవ్ మెరుపు వేగంతో వికెట్ కీపర్ కుందు వైపు విసిరాడు. అతడు వికెట్లను గిరాటేయగా..174కే ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే దీపేశ్(2-39) ఓవర్లో ఫర్హాన్ అహ్మద్(1) కుందు చేతికి చిక్కాడు. సెబాస్టియన్ మెర్గాన్ సైతం అతడికే రిటర్న్ క్యాచ్ ఇవ్వగా ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది.