AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
AB de Villiers : ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో విధ్వంసక ఆటతో అలరించిన ఏబీ డివిలియర్స్ (AB de Villiers) మళ్లీ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో తుఫాన్ బ్యాటింగ్‌తో బౌలర్ల భరతం పట్టాడీ వెటరన్.
AB de Villiers : ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఏబీ డివిలియర్స్ (AB de Villiers) ఓ సంచలనం. అప్పట్లో మేటి బౌలర్లను ఉతికేస్తూ విధ్వంసక ఆటతో అలరించిన అతడు మళ్లీ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో తన తుఫాన్ బ్యాటింగ్‌తో బౌలర్ల భరతం పట్టాడీ వెటరన్. ఆటకు వీడ్కోలు పలికి ఐదేళ్లు గడుస్తున్నా.. వయసు పైబడినా సరే తనలో చేవ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ 37 బంతుల్లోనే మెరుపు శతకం బాదేశాడీ మాజీ మిస్టర్ 360. దాంతో.. ఈ దక్షిణాఫ్రికా లెజెండ్‌ను ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో రెచ్చిపోయిన అతడు ఆస్ట్రేలియా ఛాంపియన్స్ (Australia Champions) బౌలర్లకు చుక్కలు చూపించాడు. మైదానం నలువైపులా షాట్లతో మిస్టర్ 360 అని నిరూపించుకున్న అతడు.. కేవలం 37 బంతుల్లోనే శతకం సాధించాడు.
🔴ONLY ONE PERSON CAN CONVINCED AB TO TAKE HIS RETIREMENT BACK 🤯
🎙️: Ab De Villiers said that the only reason why he’s playing this tournament is his kids never got to see him play live much.
And the way he’s been playing I’m sure his kids must be asking to take the retirement back play one more time in IPL for RCB. 😭🔥❤️.— Sam (@cricsam02) October 9, 2026
తన పిల్లలు కళ్లారా తన ఆట చూడాలని కోరడంతోనే ఈ టోర్నమెంట్ ఆడుతున్నానని తెలిపిన ఈ దిగ్గజం క్రీజులో ఉన్నంతసేపు మెరుపు బ్యాటింగ్ చేశాడు. ఆసీస్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని అతడు మంచు ముక్కలా కరిగించాడు. 40 బంతుల్లో ఆరు ఫోర్లు, పదకొండు సిక్సర్లతో అతడు 111 రన్స్ చేయడంతో 15.4 ఓవర్లోనే విజేతగా నిలిచింది సఫారీ జట్టు.
111* OFF 40, 𝑨𝑩𝑺𝑶𝑳𝑼𝑻𝑬 𝑩𝑬𝑨𝑺𝑻 DE VILLIERS 🥵🔥
Catch all the action from the World Championship of Legends LIVE on FanCode 📲
#WCL #Cricket #ABdeVilliers #Sixes https://t.co/NyXFdVofoI
— FanCode (@FanCode) October 9, 2026
229.11 స్ట్రయిక్ రేటుతో
డబ్ల్యూసీఎస్‌లో దంచేస్తున్న డివిలియర్స్ రెండు మ్యాచుల్లోనే 181 రన్స్ కొట్టాడు. అది కూడా 229.11 స్ట్రయిక్ రేటుతో. ఒకప్పటిలా బెరుకు లేకుండా అతడు చెలరేగిన తీరు చూసిన అభిమానులు మళ్లీ ఐపీఎల్ ఆడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఐపీఎల్ 20వ సీజన్ వేలంలో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మనోడిని కోరుతున్నారు. గతంలో విరాట్ కోహ్లీ (Virat Kohli)తో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఆడిన డివిలియర్స్ చెరగని ముద్ర వేశాడు. పదకొండు సీజన్లు (2011 నుంచి 2021) ఆర్సీబీ జెర్సీతో 156 మ్యాచుల్లో.. 4,491 రన్స్ కొట్టాడతడు. అందులో.. రెండు శతకాలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

