మూడు మ్యాచుల్లో రెండు ఓటములతో ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా దంచికొడుతున్నాడు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (3 నాటౌట్) కేవలం యాంకర్ పాత్ర పోషిస్తుండగా.. పృథ్వీ షా (50 నాటౌట్) మాత్రం లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
అతను పవర్‌ప్లే ముగిసే సరికి 8 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. దీంతో తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. ఆ తర్వాతి ఓవర్లోనే షా తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.