ఢిల్లీతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (24), క్వింటన్ డీకాక్ (47 నాటౌట్) ఇద్దరూ రాణించారు. అయితే కుల్దీప్ యాదవ్ వేసిన పదో ఓవర్లో టైమింగ్ సరిగా కుదరకపోవడంతో రాహుల్ పెవిలియన్ చేరాడు.
భారీ షాట్‌కు యత్నించిన అతను లాంగాఫ్‌లో ఉన్న పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో ఢిల్లీ జట్టు తొలి వికెట్ దక్కించుకుంది. రాహుల్ అవుటవడంతో ఎవిన్ లూయిస్ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ డీకాక్.. అర్ధశతకానికి దగ్గరలో ఉన్నాడు. ప్రస్తుతం లక్నో జట్టు పది ఓవర్లకు 73/1 స్కోరుతో నిలిచింది.