ఢిల్లీ : భారత యువ గ్రాండ్‌మాస్టర్, ఇటీవలే ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన దొమ్మరాజు గుకేశ్ ఫిడే ర్యాంకింగ్స్‌లో నాలుగో ర్యాంక్‌కు చేరాడు. ఫిడే తాజా గా వెలువరించిన ర్యాంకింగ్స్‌లో గుకేశ్ 2,784 ఎలో రేటింగ్ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో నిలిచాడు. కార్ల్సన్ (2832.5) అగ్రస్థానంలో కొనసాగుతుండగా నకముర (2,802), ఫాబియానో (2,798).. గుకేశ్ కంటే ముందున్నారు. టాటా స్టీల్ చెస్ టోర్నీ రెండో రౌండ్లో గెలిచిన తర్వాత గుకేశ్ ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇన్నాళ్లూ నాలుగో స్థానంలో ఉన్న అర్జున్ ఇరిగేసి (2,779.5) ఐదో ర్యాంక్‌కు పడిపోయాడు. భారత ర్యాంకింగ్స్‌లోనూ గుకేశ్.. అత్యుత్తమ ర్యాంకును దక్కించుకున్నాడు.