హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఫిట్నెస్, సైక్లింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రముఖ సైక్లిస్ట్ , వెల్నెస్ స్పెషలిస్టు కాంతిదత్ హైదరాబాద్ నుంచి ముంబైకి సైక్లింగ్ యాత్ర ప్రారంభించాడు.
ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు జరుగనున్న 800కిలోమీటర్ల ప్రయాణంలో 30 చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయ్ సహకారంతో ఈ టూర్ నిర్వహిస్తున్నారు.