రుద్రంపూర్, మార్చి 27 : కొత్తగూడెం ఏరియాకు కొత్తగా జూనియర్ ఇన్స్పెక్టర్లుగా నియమితులైన టి.కామరాజు, ఎండీ.గౌస్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం వారు ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు, ఎస్ఓ టు జీఎం జీబీ కోటిరెడ్డి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాషను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు వారికి అభినందనలు తెలియజేస్తూ విధుల్లో సమర్థవంతంగా పని చేయాలని ఆకాంక్షించారు.