తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ ( Tandur ) మండలంలో శుక్రవారం శ్రీరామ నవమి( Sri Rama Navami ) సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆయా దేవాలయాలలో కల్యాణ మహోత్సవ వేడుకలను వేద పండితులు వైభవంగా నిర్వహించారు. కల్యాణమహోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఆలయ కమిటీ నిర్వాహకులు, హనుమాన్ మాలా దీక్షదారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, యూత్ మండలీల సభ్యులు శ్రీరాముని ప్రతిమ, జెండాలు చేతబూని వాహనాల ర్యాలీతో, పల్లకి సేవలతో కలిసి భారీ శోభాయాత్ర నిర్వహించారు. ప్రజలు కల్యాణ మహోత్సవాలలో పాల్గొని పూజలు నిర్వహించారు. కల్యాణ మహోత్సవానంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు, బెల్లం పాణకం, వడపప్పు వితరణ చేశారు.