Jeet Tere Haath Mein | వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023) వేట ప్రారంభించేందుకు టీమ్ఇండియా (Team India) రెడీ అయింది. ఇటీవల ఆసియా కప్ గెలిచినా భారత్.. అదే జోరుతో వరల్డ్‌కప్‌లోనూ శుభారంభం చేసేందుకు సమాయత్తమైంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో భారత అభిమానులను ఉత్సాహపరిచేందుకు స్టార్ స్పోర్ట్ టీమ్ఇండియా థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. జీత్ తేరే హాత్ మే (విజయం నీ చేతుల్లో) అంటూ సాగిన ఈ పాట ఒక ఎమోషనల్ రైడ్‌లా సాగింది. ఇక ఈ పాటను మీరు చూసేయండి.
దశాబ్ద కాలంగా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలువని భారత జట్టు.. ఈ సారి ఆ కరువు తీర్చుకోవాలని తహతహలాడుతున్నది. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత్.. సేమ్ సీన్ రిపీట్ చేయాలని చూస్తుంది.