భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మూడో ఓవర్లోనే వెనుతిరిగాడు. తీక్షణ వేసిన ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డుప్లెసిస్.. లాంగాన్‌లో జోర్డాన్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అంతకుముందు రాబిన్ ఊతప్ప (89), శివమ్ దూబే (95 నాటౌట్) విజృంభించడంతో చెన్నై జట్టు 216 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ లక్ష్య ఛేదనను బెంగళూరు చాలా నెమ్మదిగా ఆరంభించింది. డుప్లెసిస్ (8)తోపాటు అనూజ్ రావత్ కూడా బౌండరీలు బాదడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే భారీ షాట్‌కు యత్నించి డుప్లెసిస్ వికెట్ పారేసుకున్నాడు.