CSK vs MI | నిప్పులు చెరిగిన ముకేష్ చౌదరి.. నాలుగు వికెట్లు కోల్పోయినముంబై
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న రోహిత్ శర్మ (18) పెవిలియన్ చేరాడు. సిమర్జీత్ సింగ్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి అతను పెవిలియన్ చేరాడు. ఐదో స్టంప్ మీదకు వేసిన గుడ్ లెంగ్త్ బాల్‌ను ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్.. బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు.
దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని మొయీన్ అలీ క్యాచ్ పట్టేశాడు. అంతకుముందు ఇషాన్ కిషన్ (6) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలకెత్తుకున్న రోహిత్.. కొన్ని మంచి షాట్లు ఆడాడు. నాలుగు ఫోర్లు బాదిన అతను 14 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కాసేపటికే డానియల్ శామ్స్ (1), ట్రిస్టన్ స్టబ్స్ (0)ను కూడా ముకేష్ చౌదరి పెవిలియన్ చేర్చాడు. ఒకే ఓవర్లో ఇద్దరినీ ఎల్బీగా అవుట్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- CSK vs MI
- ipl 2022
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

