ఐపీఎల్ 2023లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీకి కీలకం. 8పాయింట్లతో టేబుల్లో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో నెగ్గి క్వాలిఫయింగ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటోంది.
చెన్నైలో గత కొద్ది రోజులుగా వర్షం కురుస్తోంది. వర్షం ఆటకు ఆటంకం కలిగించకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపొచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై, ఢిల్లీ ఇప్పటివరకు 27 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో చెన్నై 17సార్లు విజయం సాధించగా, ఢిల్లీ 10 సార్లు గెలిచింది. డెవన్ కాన్వే గతేడాది ఢిల్లీపై 49 బాల్స్‌లో 87 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై అలవోకగా గెలిచింది. మరోసారి అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయాలని టీం ఆశిస్తోంది. మరోవైపు స్టోక్స్ ఫిట్నెస్ సాధించినట్లు టీం మేనెజ్మెంట్ తెలిపింది.
చెన్నై టీం అంచనా: రుతురాజ్, డెవన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, జడేజా, ధోనీ, దీపక్ చాహర్, తీక్షణ, పతిరాణ, తుషార్ దేశ్‌పాండే.
ఢిల్లీ క్యాపిటల్స్
రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆడేందుకు ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు ఔటయ్యాడు. కాబట్టి కుల్దీప్ యాదవ్ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. మరోవైపు డెవన్ కాన్వే ఎడవచేతివాటం స్పిన్నర్లలో దంచికొడుతున్నాడు. ఈ సీజన్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ అతడి స్ట్రైక్‌రేట్ 203. కాన్వేతో పాటు శివమ్ దూబేకు కూడా మంచి స్ట్రైక్‌రేట్ ఉంది. వీరిని నిలువరించేందుకు ఢిల్లీ బౌలర్లు తమ వ్యూహాలకు పదును పెట్టాల్సిందే. చెపాక్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చివరగా ఆడిన 6 మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే మార్ష్ ఫామ్ ఢిల్లీకి కలిసొచ్చే అంశం.
ఢిల్లీ టీం అంచనా: వార్నర్, ఫిల్ సాల్ట్, మార్ష్, రోసో, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.