IPL 2026 : పంతొమ్మిదో సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) స్క్వాడ్‌లో కీలక మార్పు చేసింది. మూడో స్థానంలో దంచేసిన 18 ఏళ్ల ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతడి స్థానంలో డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌ను తీసుకుంది. యువ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌ను చెన్నై తమ స్క్వాడ్‌లోకి ఆహ్వానించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా సీఎస్కే యాజమాన్యం వెల్లడించింది.
ఐపీఎల్ 19వ సీజన్లో తడబడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ యూనిట్‌ను పటిష్టం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కాలి కండరాల నొప్పితో మైదానం వీడి.. జట్టుకు దూరమైన ఆయుశ్ మాత్రే స్థానాన్ని ఆకాశ్ మధ్వాల్‌తో భర్తీ చేసింది. మాత్రే సైతం గాయపడిన వేళ.. అతడి బదులు పేస్ సంచలనమైన మధ్వాల్‌ను స్క్వాడ్‌లో చేర్చుకుంది సీఎస్కే. ఇప్పటి వరకూ ఐపీఎల్లో 17 మ్యాచ్‌ల అనుభవమున్న మధ్వాల్ 23 వికెట్లు పడగొట్టాడు.
Official Announcement
Speed incoming!! ⚡️
Akash Madhwal is now #Yellove 💛Note: Akash Madhwal replaces Ayush Mhatre, who has been ruled out due to hamstring injury.#WhistlePodu pic.twitter.com/tSgnZupmZb
— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2026
డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన ఈ స్పీడ్‌స్టర్2023 ఎలిమినేటర్‌లో 5/5తో అత్యుతమ గణాంకాలు నమోదు చేశాడు.కుడి చేతివాటం పేసరైన మధ్వాల్‌కు సీఎస్కే రూ.30 లక్షలు చెల్లించనుంది. పద్దెనిమిదో సీజన్ వేలంలో రూ.1.20 కోట్లకు ఈ కుర్ర పేసర్‌ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
సీజన్ ఆరంభానికి ముందే నాథన్ ఎల్లిస్ దూరమవ్వగా.. ఈమధ్యే సీనియర్ ఖలీల్ అహ్మద్ గాయంతో వైదొలిగాడు. దాంతో, చెన్నై బౌలింగ్ భారమంతా యువ పేసర్ అన్షుల్ కాంభోజ్ మోస్తున్నాడు. ఇప్పుడు మధ్వాల్ రాకతో గైక్వాడ్ సేన బౌలింగ్ దళం పటష్టంగా కనిపిస్తోంది. స్పిన్ యూనిట్లో నూర్ అహ్మద్ అద్భుతంగా రాణిస్తున్నాడు.
Hit the 🎯 with DB 🤝 KS
Wait for Thala’s entry in the end 😎#WhistlePodu #MIvCSK pic.twitter.com/DNy93wOVy8— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2026
కానీ, బ్యాటింగ్ దళం వైఫల్యం చెన్నై విజయావకాశాల్ని దెబ్బతీస్తోంది. ఫలితంగా ఆడిన ఆరు మ్యాచుల్లో ఆ జట్టు రెండే రెండు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడింది. గురువారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో చెన్నై తలపడనుంది. అట్టడుగు ఉన్న రెండు జట్లు విజయంతో ముందంజ వేయాలనే కసితో ఉన్నాయి.