CSK CEO : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఆడకపోవడంతో అతడి భవితవ్యం ఏంటీ? అనేది చర్చనీయాంశంగా మారింది. హుందాగా వీడ్కోలు పలికుతాడా లేదా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కోచ్, మెంటర్, క్రికెటర్ డైరెక్టర్ .. వంటి పదవులు చేపడుతాడా? అనేది అంతుచిక్కడం లేదు. ఎందుకంటే.. పెద్దన్నలాంటి మహీ భాయ్‌ను సీఎస్కే యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లనూ వదులుకోదు. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ (Kasi Vishwanathan) మాట్లాడుతూ ధోనీ భవితవ్యం మా చేతుల్లో లేదని కుండబద్ధలు కొట్టేశాడు.
ఐపీఎల్లో ధోనీ శకం ముగిసిందా? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. పంతొమ్మిదో సీజన్‌కు దూరమవ్వడంతో.. ఇకపై ఆటగాడిగా ధోనీని మైదానంలో చూడలేమని, కోచ్‌గా వస్తాడని ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే.. సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందింస్తూ ధోనీ భవితవ్యం తమ చేతుల్లో లేదని స్పష్టం చేశాడు. ఇదివరకు చెప్పనట్టే.. ధోనీని తాము అడ్డుకోమని, అతడికి నచ్చినన్ని రోజులు ఆడనిస్తామని చెప్పాడు.
🚨 MASSIVE STATEMENT BY CSK CEO ON MS DHONI FUTURE IN CSK 🚨
He Said 🗣️, “We would always want him to remain a permanent part of CSK whether as a player, coach, or mentor. Whatever the role may be, it completely depends on the decision he makes. Every decision is in his hands.” pic.twitter.com/H5kSUFi0nG
— lndian Sports Netwrk (@IS_Netwrk29) May 27, 2026
‘ధోనీ గురించి మేము ఇప్పుడే ఆలోచించడం లేదు. అతడి భవితవ్యాన్ని అతడికే వదిలేశాం. అతడు ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తాం. సీఎస్కే ఫ్రాంచైజీలో ధోనీని శాశ్వత సభ్యుడిగా భావిస్తాం. ఆటగాడిగా లేదంటే కోచ్‌గా లేదా మెంటర్‌గా.. అతడు ఏది ఇష్టపడితే అదే హోదాలో కొనసాగేందుకు అనుమతిస్తాం. ఏ నిర్ణయమైనా అతడి చేతుల్లోనే ఉంది. ధోనీ, కోచ్ ఫ్లెమింగ్‌లు రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రశాంతమైన కెప్టెన్‌గా తీర్చిదిద్దారు. గైక్వాడ్ సారథ్యంలో సీఎస్కే గొప్ప విజయాలు సాధిస్తుంది’ అని విశ్వనాథన్ వెల్లడించాడు.

ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ గైర్హాజరీలో తీవ్రంగా నిరాశపరిచింది. 19వ సీజన్లో ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. కీలక ఆటగాళ్లకు గాయాలు, సమిష్టితత్వం కొరవడడం.. బౌలింగ్ యూనిట్లో అన్షుల్ కంబోజ్ ఒక్కడే రాణించడం వంటివి చెన్నై జట్టును ఇంటికి పంపించాయి.