IPL 2024 | సీఎస్కే బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ బ్యూటీ..!
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 17వ సీజన్ ప్రారంభానికి ముందే వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎతిహద్ ఎయిర్వేస్ (Etihad Airways) కంపెనీకి స్పాన్సర్షిప్ హక్కులు కట్టబెట్టిన సీఎస్కే..
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 17వ సీజన్ ప్రారంభానికి ముందే వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎతిహద్ ఎయిర్వేస్ (Etihad Airways) కంపెనీకి స్పాన్సర్షిప్ హక్కులు కట్టబెట్టిన సీఎస్కే.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్(Katrina Kaif)ను ఎంపిక చేసింది. అయితే.. ఈ విషయాన్ని చెన్నై మేనేజ్మెంట్ అధికారింగా వెల్లడించలేదు.
సీఎస్కే కొత్త స్పాన్సర్ ఎతిహద్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కత్రినా.. ధోనీ సేనకు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. ధూమ్, టైగర్ జిందా, బాంగ్ బాంగ్, సింగ్ ఈజ్ కింగ్ వంటి సినిమాలతో పాపులర్ అయిన కత్రినా.. బాలీవుడ్ హీరో, ‘ఉరి'(Uri) ఫేమ్ విక్కీ కౌశల్‌ను 2021లో పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
Big news coming up..#KatrinaKaif become the brand ambassador of biggest #IPL team @ChennaiIPL 🔥🔥
Also #CSK jersey being changed this time now. #ChennaiSuperKings #Katrina #Dhoni #IPL pic.twitter.com/EiL1hyEpn0
— Ashish Robinhood Pandey (@ashispandey1693) February 10, 2024
ఐపీఎల్ 17వ సీజన్‌ను మార్చి 23న ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. ఈసారి చెన్నై డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. నిరుడు అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ధోనీ సేన గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఐదోసారి చాంపియన్‌గా అవతరించి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. చెన్నైకు రికార్డు ట్రోఫీలు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్లో చివరి సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. 41 ఏండ్ల ధోనీ 2024 ఎడిషన్‌తో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
- Bihar Assembly | బీహార్ స్పీకర్ అవధ్ బిహారీపై నెగ్గిన అవిశ్వాసం.. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు..!
- JEE Main | జేఈఈ మెయిన్ సెషన్ -1 తుది కీ విడుదల
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

