రొనాల్డోపై పోర్చుగల్ సస్పెన్షన్
కెరీర్ చరమాంకంలో ఉన్న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, 41 ఏండ్ల క్రిస్టియానో రొనాల్డోను పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య సస్పెండ్ చేసింది. టీమ్ క్యాంప్ నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయినందుకుగానూ అతడిపై క్రమశిక్షణా చర్యలను ప్రారంభించినట్లు శనివారం అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణా విచారణ కమిటీకి బదిలీ చేశామని, విచారణ పూర్తయ్యే వరకు వివరాలను రహస్యంగా ఉంచుతామని ఫెడరేషన్ స్పష్టం చేసింది.
లిస్బన్: కెరీర్ చరమాంకంలో ఉన్న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, 41 ఏండ్ల క్రిస్టియానో రొనాల్డోను పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య సస్పెండ్ చేసింది. టీమ్ క్యాంప్ నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయినందుకుగానూ అతడిపై క్రమశిక్షణా చర్యలను ప్రారంభించినట్లు శనివారం అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణా విచారణ కమిటీకి బదిలీ చేశామని, విచారణ పూర్తయ్యే వరకు వివరాలను రహస్యంగా ఉంచుతామని ఫెడరేషన్ స్పష్టం చేసింది. కొత్త కోచ్ జార్జ్ జీసస్‌తో మైదానంలో ఆడే సమయం విషయంలో ఏర్పడిన విభేదాల కారణంగా రొనాల్డో జాతీయ జట్టు క్యాంప్ నుంచి బయటకు వెళ్లాడు. పోర్చుగల్ ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లో రొనాల్డోను కోచ్ బెంచ్‌కే పరిమితం చేశాడు.
ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ పోర్చుగల్ విజయం సాధించగా, అతడి స్థానంలో వచ్చిన గొంకాలో రామోస్ మూడు గోల్స్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే, నార్వేతో జరిగిన మ్యాచ్‌లో తనను వార్మప్ చేయించి, ఆ తర్వాత మైదానంలోకి పంపకపోవడం కోచ్ చేసిన తప్పిదమని రొనాల్డో పేర్కొన్నాడు. కాగా, సరైన కారణం లేకుండా ప్రాక్టీస్ సెషన్, మ్యాచ్, జాతీయ జట్టును వీడి వెళ్లే ఆటగాడిపై నిబంధనల ప్రకారం నెల రోజుల నుంచి ఆరు నెలల వరకు సస్పెన్షన్ వేటుతో పాటు జరిమానా విధించే అవకాశముంది. ఈ వ్యవహారంపై రొనాల్డో స్పందిస్తూ ‘నేను ఇప్పటికే క్షమాపణలు చెప్పాను. కానీ నా చర్యలకు పరిణామాలు ఉంటాయని నాకు తెలుసు. ఫుట్‌బాల్‌లో హోదాతో సంబంధం లేకుండా నిబంధనలు అందరికీ ఒక్కటే’ అని పేర్కొన్నాడు. తనకు సస్పెన్షన్ తప్పకపోవచ్చని, అయితే అభిమానుల కోసం తాను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వీడ్కోలు మ్యాచ్‌లు ఆడుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

