లిస్బన్ : ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో(Cristiano Ronaldo) సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్ 2026 క్వాలిఫయింగ్ టోర్నీల్లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. పోర్చుగల్ తరపున ఆడుతున్న రోనాల్డో ఇప్పటి వరకు వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచుల్లో అత్యధికంగా 41 గోల్స్ చేశాడు. లిస్బన్లోని ఇస్టాడియో జోష్ అల్వలేడ్ స్టేడియంలో హంగేరితో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ కొత్త ఫీట్‌ను అందుకున్నాడు. అయితే పోర్చుగల్, హంగేరీ మధ్య జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్ 2-2 గోల్స్ తేడాతో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో రోనాల్డో రెండు గోల్స్ చేశాడు.
వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల చరిత్రలో గత రికార్డు గ్వాటెమాలా ప్లేయర్ కార్లో రూయిజ్ పేరిట ఉన్నది. అతను తమ దేశం తరపున క్వాలిఫయింగ్ మ్యాచుల్లో 39 గోల్స్ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు రోనాల్డో. వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచుల్లో 40 గోల్స్ మైలురాయి దాటిని తొలి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రోనాల్డో చరిత్ర సృష్టించాడు. అయితే ఇప్పటి వరకు కూడా పోర్చుగల్ జట్టు వచ్చే ఏడాది జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేదు. నవంబర్ 14వ తేదీన ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే, రోనాల్డో జట్టు వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Make that 41…
Unlike this graphic, Cristiano Ronaldo is timeless. https://t.co/JKfWtb913n
— FIFA World Cup (@FIFAWorldCup) October 14, 2025