బుడాపెస్ట్: పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. యూరో 2020లో భాగంగా గ్రూఫ్ ఎఫ్‌లో హంగరీతో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో ఈ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన రొనాల్డో.. మొత్తం 11 గోల్స్‌తో యూరోలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో హంగరీపై పోర్చుగల్ 3-0తో గెలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు యూరోలో 9 గోల్స్‌తో మిచెల్ ప్లాటినితో కలిసి రొనాల్డో టాప్‌లో ఉన్నాడు. హంగరీతో మ్యాచ్‌లో చివరి నిమిషాల్లో రొనాల్డో రెండు గోల్స్ చేశాడు.
87వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచి ఈ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఆ తర్వాత ఇంజురీ టైమ్‌లో మరో గోల్ చేసి గోల్స్ సంఖ్యను 11కు పెంచుకున్నాడు. అంతేకాదు ఐదు యురోపియన్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న తొలి ఫుట్‌బాలర్ కూడా రొనాల్డోనే కావడం విశేషం. ఇప్పటికే 36 ఏళ్లున్న రొనాల్డోకు ఇదే చివరి యూరో కప్ కానుందని అంచనా వేస్తున్నారు.
⏰ RESULT ⏰
— UEFA EURO 2024 (@EURO2024) June 15, 2021
🔥 Cristiano Ronaldo becomes all-time EURO top scorer
🇵🇹 Ronaldo nets twice in Portugal win; Guerreiro also on target
Who did it best? 🤔#EURO2020