Simran Shaikh : మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లోని ధారవి ఏరియాలో మహిళా క్రికెటర్ (Woman cricketer) సిమ్రాన్ షేక్ (Simran Shaikh) కు ఘన స్వాగతం లభించింది. సిమ్రాన్ కుటుంబసభ్యులు ఆమెను ఘనంగా స్వాగతించారు. మేళ తాళాలతో ఆమెను ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంటిముందు పటాసులు కాల్చి సంబురాలు చేసుకునారు. పూల మాలలు వేసి, శాలువాలతో సత్కరించారు.
ఇదంతా ఎందుకు చేశారు..? ఇంతకూ ఎవరా మహిళా క్రికెటర్..? అని ఆలోచిస్తున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్దాం. ఆ యువతి పేరు సిమ్రాన్ షేక్. ఆమె ఒక క్రికెటర్. ఇటీవల జరిగిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో ఆమె భారీ ధర పలికింది. గుజరాత్ జియాంట్స్ జట్టు ఆమెను రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది. వేలం తర్వాత తొలిసారి ఆమె ఇంటికి చేరుకోవడంతో కుటుంబం ఘనంగా స్వాగతించింది.
#WATCH | Dharavi, Maharashtra: Cricketer Simran Shaikh receives a grand welcome from her family members and locals in Dharavi.
She was bought by Gujarat Giants for Rs 1.9 crore in the Women’s Premier League (WPL) auction. pic.twitter.com/1ysPmilWX8
— ANI (@ANI) December 17, 2024