భారత వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్పకు పుత్రికోత్సాహం కల్గింది. ఊతప్ప భార్య శీతల్ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్మీడియా ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నాడు. ‘హృదయం ప్రేమతో నిండిపోయింది. మా కుటుంబంలో దేవత లాంటి పాపను ఆహ్వానిస్తున్నాం. ట్రినిటీ తియా ఊతప్పను మీకు పరిచయం చేస్తున్నా’ అంటూ రాబిన్ రాసుకొచ్చాడు.