గ్లాస్గోవ్: అమెరికాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనున్న స్కాట్లాండ్ (Cricket Scotland)జట్టుకు కర్నాటకకు చెందిన నందిని డెయిరీ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరించనున్నది. స్కాటిష్ క్రికెటర్ల షర్ట్‌లపై నందిని లోగో ఉండనున్నది. జూన్ రెండవ తేదీ నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఆ టోర్నీ జరగనున్నది. కర్నాటక పాల సమాఖ్యతో ఒప్పందం కుదిరినట్లు క్రికెట్ స్కాట్లాండ్ పేర్కొన్నది. ఆటగాళ్లు వేసుకునే టీ షర్ట్ స్లీవ్స్ మీద నందిని బ్రాండ్ నేమ్, లోగో.. కన్నడ భాషలో ఉంటుందని క్రికెట్ స్కాట్లాండ్ వెల్లడించింది. తన తొలి మ్యాచ్‌లో జూన్ 4వ తేదీన ఇంగ్లండ్‌తో స్కాట్లాండ్ ఆడనున్నది. తొలిసారి నందిని బ్రాండ్ క్రికెట్ ప్రేక్షకులను అంతర్జాతీయ దేశాల వైపు మళ్లిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.