సిడ్నీ: మహిళల పట్ల జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా అఫ్గానిస్థాన్‌తో ఆగస్టులో జరుగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాజాగా వాయిదా వేసింది. అఫ్గన్‌లో నానాటికీ మహిళలు, బాలికల పరిస్థితి దిగజారడం వలనే సిరీస్ వాయిదా వేస్తున్నట్లు సీఏ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
తాలిబన్ల అధికారంలో అఫ్గన్‌లో మహిళలపై అంక్షల పర్వం కొనసాగుతున్నది. ఆడపిల్లలను, యువతులను చదువు దూరం చేస్తూ, మహిళలు ఉద్యోగాలు చేయకుండా నిషేధం విధించింది. దీంతో అఫ్గన్ అవలంభిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయానికి వచ్చింది.