అహ్మాదాబాద్: తన ఫెవరేట్ షాట్ కవర్ డ్రైవ్ అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam) తెలిపాడు. ఐసీసీ పోస్టు చేసిన వీడియోలో ఆయన ఈ విషయాన్ని తెలిపాడు. కవర్ డ్రైవ్ తన ఫెవరేట్ షాట్ అయినా.. స్ట్రెయిట్ డ్రైవ్ ఆడడం చాలా సంతోషాన్ని ఇస్తుందన్నాడు. ఆ షాట్ ఆడేందుకు చాలా స్కిల్ కావాలన్నాడు. ఆ షాట్ ఆడాలంటే చాలా బ్యాలెన్స్ ఉండాలని, ఆ షాట్ ఆడేందుకు చాలా ప్రాక్టీస్ ఉండాలన్నాడు. సౌతాఫ్రికా లెజండరీ బ్యాటర్ ఏబీ డివిల్లీర్స్‌ను తన రోల్ మోడల్‌గా తీసుకుంటున్నట్లు చెప్పాడు. డివిల్లీర్స్‌ను కాపీ కొడుతున్నట్లు తెలిపాడు. అతన్ని ఫాలో అయ్యేవాడినన్నాడు. అతని వీడియోలను చూస్తూ, షాట్స్ నేర్చుకున్నట్లు బాబర్ చెప్పాడు. పాక్ క్రికెటర్లు కెప్టెన్ బాబర్‌పై ప్రశంసలు కురిపంచారు. మరికాసేపట్లో వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ వన్డే మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.