హైదరాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన రాష్ట్ర ప్లేయర్లు పెంటాల హరికృష్ణ, మోడెం వంశీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం తన నివాసంలో ఇద్దరు ప్లేయర్ల ప్రతిభను ఆయన కొనియాడారు.
బుడాపెస్ట్(హంగరీ) వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ చరిత్ర లిఖించిన భారత జట్టులో హరికృష్ణ సభ్యుడు కాగా, కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో భద్రాచలానికి చెందిన వంశీ పసిడి పతకంతో మెరిశాడు. మరోవైపు భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ తన వివాహా ఆహ్వాన పత్రాన్ని సీఎం అందజేశాడు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎంపీ బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.