BCCI : ప్రపంచంలోనే సంపన్న బోర్డైన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రభుత్వ సంస్థనా?, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థనా? అనే సందిగ్ధతకు తెరపడింది. 2018 నుంచి కోర్టులో నలుగుతున్న ఈ అంశంపై స్పష్టతనిస్తూ.. బీసీసీఐ ప్రభుత్వం సంస్థ కాదని సోమవారం కేంద్ర సమాచార కమిషన్(CIC) కుండబద్ధలు కొట్టింది. సమాచార హక్కు చట్టం(RTI) కింద బీసీసీఐ విధివిధానాలు, పనితీరును వివరించాలని కోరుతూ దాఖలైన అప్పీల్‌కు బదులిస్తూ బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కాదని సీఐసీ వెల్లడించింది. అంతేకాదు ప్రభుత్వానికి బీసీసీఐపై ఎలాంటి అధికారాలు లేవని పేర్కొంది.
బీసీసీఐ ప్రభుత్వ సంస్థ అని, ప్రభుత్వ సమాచార అధికారి(PRO)ని నిమమించాలనే 2018 నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఆర్టీఐ చట్టం ప్రకారం బీసీసీఐ ప్రభుత్వ సంస్థ అని, పీఆర్ఓను నియమించాల్సిందేనని సమాచార కమిషన్ మాజీ చైర్మన్ ఎం శ్రీధర్ ఆచార్యులు(M Sridhar Acharyulu) పట్టుబట్టారు. దాంతో, బీసీసీఐ ఆలస్యం చేయకుండా మద్రాస్ హై కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు నియయాలను పాటిస్తూ కొత్తగా విచారణ చేపట్టాలని కేంద్ర సమాచార కమిషన్‌ను మద్రాస్ ధర్మాసనం కోరింది.
STORY | BCCI not a public authority under RTI Act: CIC
The Central Information Commission on Monday said the Board of Control for Cricket (BCCI) in India is not a “public authority” under the RTI Act as it is neither owned, controlled nor substantially financed by the… pic.twitter.com/RbtUslOWF9
— Press Trust of India (@PTI_News) May 18, 2026
ఈనేపథ్యంలోనే భారత్‌కు బీసీసీఐ ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తుంది? జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు ఆటగాళ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తుంది? వంటి వివరాలు కోరుతూ దాఖలైన అప్పీల్‌ను సోమవారం సమాచార కమిషన్ కొట్టిపారేసింది. అందుకు కారణాలు కమిషనర్ పీఆర్ రమేశ్(PR Ramesh) తన ఉత్తర్వుల్లో వివరించారు. ప్రభుత్వం బీసీసీఐకి యజమాని కాదు, ఆ సంస్థను నియంత్రించడం లేదు, ప్రోత్సహకాలు ఇవ్వడం లేదు, ఆర్ధిక సాయం చేయడం లేదు అని ఆయన వెల్లడించారు.
#BreakingNews
BCCI not government body, not subject to RTI Act: Central Information CommissionRead here: https://t.co/NiOIpNLfmL pic.twitter.com/I5w7CHDp19
— Bar and Bench (@barandbench) May 18, 2026
బీసీసీఐ అనేది స్వయంప్రతిపత్తి గత సంస్థ. తమిళనాడు సొసైటీస్ రిజిష్ట్రేషన్ చట్టం కింద బీసీసీఐ రిజిష్టరైంది. రాజ్యాంగం ప్రకారం, పార్లమెంట్ లేదా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ద్వారా లేదా ప్రభుత్వ ప్రకటన ద్వారా ఈ సంస్థ ఏర్పడలేదు. కాబట్టి ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(h)కింద నమోదు చేయడానికి అవసరమైన చట్టపరమైన అర్హతలు బీసీసీఐకి లేవని కమిషన్ తేల్చింది. అందుకనే భారత బోర్డును ప్రభుత్వ సంస్థగా పరిగణించలేం అని కమిషనర్ పీఆర్ రమేశ్ వివరించారు.