క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్.. రెజ్లర్ సుశీల్‌ను స్టేడియంకు తీసుకువెళ్లిన పోలీసులు

న్యూఢిల్లీ : ఒలింపిక్స్ మెడల్ విజేత రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఓ మర్డర్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మర్డర్ విషయంలో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసేందుకు పోలీసు అతన్ని చత్రాసాల్ స్టేడియంకు తీసుకువెళ్లారు. 23 ఏళ్ల ఓ యువ రెజర్ల్ను హత్య చేసిన కేసులో సుశీల్ కుమార్ ప్రధాన నిందితుడు. కొందరు రెజ్లర్లతో మే 4వ తేదీన సుశీల్ కుమార్.. యువ రెజ్లర్లపై దాడి చేశాడు. ఆ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత పరారీ అయిన సుశీల్‌ను .. రెండు రోజుల క్రితం ఢిల్లీలోనే అరెస్టు చేశారు. మర్డర్ కేసులో ఇరుక్కున్న సుశీల్‌ను రైల్వే శాఖ ఉద్యోగం నుంచి తీసివేసింది. ప్రాపర్టీ వివాదం నేపథ్యంలో సహనం కోల్పోయిన సుశీల్.. యువ రెజ్లర్లపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య జరిగిన ఛత్రాసాల్ స్టేడియం వద్దకు ఇవాళ ఉదయం పోలీసులు వెళ్లారు. సుశీల్‌ను అక్కడకు తీసుకువెళ్లిన పోలీసులు.. హత్య జరిగిన ప్రదేశంలో సీన్‌ను రిక్రియేట్ చేశారు. ఎందుకు, ఎలా దాడి జరిగిందన్న కోణంలో అక్కడే విచారించారు. సోమవారం రోజున ఈ కేసుకు సంబంధించిన సుశీల్‌ను నాలుగు గంటల పాటు క్రైం బ్రాంచీ పోలీసులు విచారించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

