Cheteshwar Pujara | క్రికెట్‌కు వీడ్కోలుకు పలికిన ఛెటేశ్వర్ పుజారా.!
Cheteshwar Pujara | భారత క్రికెట్‌కు 'నయా వాల్'గా పేరు గాంచిన సీనియర్ టెస్ట్ ప్లేయర్ ఛెటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.
Cheteshwar Pujara | భారత క్రికెట్‌కు ‘నయా వాల్’గా పేరు గాంచిన సీనియర్ టెస్ట్ ప్లేయర్ ఛెటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ను ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2023లో ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు నుంచి చోటు కోల్పోయిన తర్వాత పుజారా గత కొన్నాళ్లుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో అతను తిరిగి జట్టులోకి రావడం కష్టంగా మారింది. దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శనలు చేసినప్పటికీ, సెలెక్టర్ల నుంచి పిలుపు రాలేదు. దీంతో ఇకపై తనకు జట్టులో చోటు దక్కడం కష్టమని భావించిన అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పుజారా నిర్ణయాన్ని పలువురు క్రికెటర్లు స్వాగతిస్తున్నారు.
కెరీర్ పరంగా చూసుకుంటే.. పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. 43.60 సగటుతో మొత్తం 7,195 పరుగులు చేశారు. ఇందులో 19 సెంచరీలు మరియు 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పుజారా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నారు. ఆ సిరీస్‌లో మొత్తం 521 పరుగులు చేసి, భారతదేశం తొలిసారిగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే టెస్ట్‌లలో రాణించిన పుజారా వన్డేలలో రాణించలేకపోయాడు. తన క్రికెట్ కెరీర్లో కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడారు. క్రీజులో ఎక్కువ సేపు నిలబడి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే పుజారాని చూసి రాహుల్ ద్రవిడ్ తర్వాత, పుజారాను ‘నయా వాల్’ అని పిలిచేవారు.
Wearing the Indian jersey, singing the anthem, and trying my best each time I stepped on the field – it’s impossible to put into words what it truly meant. But as they say, all good things must come to an end, and with immense gratitude I have decided to retire from all forms of… pic.twitter.com/p8yOd5tFyT
— Cheteshwar Pujara (@cheteshwar1) August 24, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

