ఓవల్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పేలవంగా ఆడుతోంది. రోహిత్ సేనకు చెందిన టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఏ ఒక్క బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అయితే ఆస్ట్రేలియా బౌలర్లు తమ పేస్ అటాక్‌తో ఇండియన్ బ్యాటర్లను ఇబ్బందిపెడుతున్నారు. ఫైనల్ టెస్ట్ రెండో రోజు .. ఇండియన్ బ్యాటర్ చతేశ్వర్ పూజారా(Cheteshwar Pujara) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటి వరకు డిఫెన్స్ ఆటతీరుతో ఆకర్షించిన పూజారా.. అనూహ్య రీతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెమరూన్ గ్రీన్ వేసిన ఇన్‌స్వింగర్ బంతికి అతను చిక్కాడు. ఆ అద్భుతమైన ఔట్‌కు చెందిన వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా అయిదు వికెట్ల నష్టానికి 151 రన్స్ చేసింది. రహానే, భరత్‌లు క్రీజ్‌లో ఉన్నారు.