West Indies Sqaud : వెస్టీండీస్ జట్టు సుదీర్ఘ విరామం తర్వాత భారత పర్యటన వస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భాగంగా ఏడేళ్ల తర్వాత కరీబియన్ బృందం ఇండియాకు రానుంది. దాంతో.. వెస్టిండీస్ సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. రోస్టన్ ఛేజ్ సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ఆడిన స్క్వాడ్‌లోని ముగ్గురిని మార్చేశారంతే. వాళ్ల బదులు సుదీర్ఘ ఫార్మాట్‌కు కొంతకాలంగా దూరమైన తంగ్నరైన్ చందర్‌పాల్‌ను, మిడిలార్డర్ బ్యాటర్ అలిక్ అథనాజే, స్పిన్నర్ ఖారీని తీసుకున్నారు సెలెక్టర్లు. అయితే.. తమ ప్రధాన స్పిన్నర్ మోతీని మాత్రం పక్కన పెట్టేశారు.
‘ఉపఖండంలో ఆడడం ఎల్లప్పుడూ సవాల్‌గానే అనిపిస్తుంది. అందుకని అక్కడి పరిస్థితలకు సరిపోయే జట్టును మేము ఎంపిక చేశాం. డబ్ల్యూటీసీ 2025-27లో ఇది మాకు రెండో టెస్టు సిరీస్. ఇప్పటికే సమిష్టిగా మా సత్తా ఏంటో చూపించాం. మా బ్రాండ్ ఆట, వ్యూహాలతో భారత్‌కు చెక్ పెడుతాం’ అని వెస్టిండీస్ కోచ్ డారెన్ సమీ వెల్లడించాడు. రెండు టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు అక్టోబర్‌లో భారత్‌కు రానుంది. అక్టోబర్ 2న జరుగబోయే తొలి మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టు అహ్మదాబాద్ వేదికగా, రెండో మ్యాచ్ ఢిల్లీ స్టేడియంలో జరుగునున్నాయి.
Tagenarine Chanderpaul and Alick Athanaze earn recalls to West Indies’ squad for the Test tour of India; Khary Pierre gets his maiden Test call-up
Kraigg Brathwaite, Keacy Carty, Mikyle Louis and Johann Layne have been dropped following the 3-0 defeat to Australia at home pic.twitter.com/dNmQyzl0C1
— ESPNcricinfo (@ESPNcricinfo) September 16, 2025
వెస్టిండీస్ స్క్వాడ్ : రోస్టన్ ఛేజ్(కెప్టెన్), జొమెల్ వర్రికన్, కెవ్లోన్ అండర్సన్, అలిక్ అథనాజే. జాన్ క్యాంప్‌బెల్, తంగ్నరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇంప్లిచ్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, అండర్సన్ ఫిలిప్, ఖారీ పియెర్రీ, జైడన్ సీల్స్.