Champions Trophy | కొత్త వివాదానికి తెరలేపిన పాకిస్థాన్.. కనిపించని భారత్ జెండా..!
Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఈ నెల 19న మొదలుకానున్నది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆతిథ్య పాకిస్థాన్ తలపడనున్నది. అయితే, భారత్ జట్టు మ్యాచులన్నీ దుబాయిలో ఆడుంది. ఐసీసీ ఈవెంట్ హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న విషయం తెలిసిందే.
Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఈ నెల 19న మొదలుకానున్నది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆతిథ్య పాకిస్థాన్ తలపడనున్నది. అయితే, భారత్ జట్టు మ్యాచులన్నీ దుబాయిలో ఆడుంది. ఐసీసీ ఈవెంట్ హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వెంట్‌కు ముందు పాకిస్థాన్ కొత్త వివాదానికి తెరలేపింది. అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం ఏదైనా టోర్నీ జరుగుతున్న సమయంలో.. టోర్నీలో పాల్గొనే జట్లకు సంబంధించిన జెండాలను ఎగుర వేయాల్సి ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కరాచీ స్టేడియంలో భారత జెండాను పాకిస్థాన్ ఎగుర వేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు పాక్ చర్యలపై మండిపడుతున్నారు.
కరాచీ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీలో పాల్గొంటున్న ఏడు దేశాల జెండాలను కరాచీ స్టేడియంపై కనిపించాయి. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌లు కరాచీ స్టేడియంలో షెడ్యూల్ చేయలేదు. అయినా.. ఆ రెండు దేశాల జెండాలను మాత్రం ఎగుర వేశారు. వాస్తవానికి భద్రతా కారణాలను చూపుతూ భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కు వెళ్లేందుకు నిరాకరించింది. దాంతో ఐసీసీ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్థాన్‌ను ఒప్పించింది. భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. దుబాయిలోనే ఫైనల్ జరుగుతుంది. లేకపోతే పాక్‌లో జరుగుతుంది. బీసీసీఐ, పీసీబీ, ఐసీసీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ ఈవెంట్స్‌లో సైతం పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్లోనే ఆడుతుంది.
No Indian flag in Karachi: As only the Indian team faced security issues in Pakistan and refused to play Champions Trophy matches in Pakistan, the PCB removed the Indian flag from the Karachi stadium while keeping the flags of the other guest playing nations. pic.twitter.com/rjM9LcWQXs
— Arsalan (@Arslan1245) February 16, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

