వింబుల్డన్: యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6-0, 6-2, 7-5తో చార్డీపై సునాయాసంగా గెలుపొందాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో 10 ఏస్‌లు కొట్టిన అల్కరాజ్ 7 బ్రేక్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు చార్డీ ఒక్క ఏస్‌కే పరిమితమై 10 డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఆండీ ముర్రె 6-3, 6-0, 6-1తో పెనిస్టోన్పై గెలిచాడు.
నిలకడగా రాణిస్తున్న అమెరికా యంగ్ గన్ కోకో గాఫ్ తొలి రౌండ్లో 4-6, 6-4, 2-6తో కెనిన్ చేతిలో ఓడింది. వీనస్ విలియమ్స్ 4-6, 3-6తో స్వితోలినా చేతిలో ఓడింది.