సెంచూరియన్: హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ( Tilak Varma).. టీ20ల్లో ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో అతను అజేయ సెంచరీ చేశాడు. 51 బంతుల్లోనే అతను శతకాన్ని బాదాడు. రెండో ఫిఫ్టీ కేవలం 19 బంతుల్లోనే కొట్టేశాడు. అయితే సెంచూరియన్ మ్యాచ్‌లో.. మూడవ నెంబర్లో బ్యాటింగ్ చేసే అవకాశం తనకు కెప్టెన్ సూర్యకుమార్ కల్పించినట్లు తిలక్ వర్మ తెలిపాడు. 56 బంతుల్లో ఏడు సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో.. తిలక్ వర్మ సెంచరీ పూర్తి చేశాడు. కానీ 3వ నెంబర్లో తిలక్ బ్యాటింగ్‌కు రావడం వల్ల.. ఆ స్థానాన్ని సూర్యకుమార్ కోల్పోయాడు.
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తిలక్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. మ్యాచ్‌కు ముందు హోటల్ రూమ్ డోర్ తట్టిన సూర్య.. ఇవాళ నువ్వు మూడవ నెంబర్లో బ్యాటింగ్ చేస్తావని చెప్పినట్లు వర్మ పేర్కొన్నాడు. కెప్టెన్ సూర్య ఇచ్చిన అవకాశాన్ని లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తిలక్ వర్మ నిలబెట్టుకున్నాడు. బ్యాటింగ్ పొజిషన్‌ను సూర్య త్యాగం చేయడం వల్లే.. ఆ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు తిలక్ తెలిపాడు. మూడవ టీ20లో 11 రన్స్ తేడాతో నెగ్గిన భారత జట్టు.. సిరీస్‌లో ఇప్పటి వరకు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్నది.
మూడవ నెంబర్ పొజిషనల్ బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడుతానని, కానీ చివరి రెండు మ్యాచుల్లో నాలుగవ నెంబర్లో ఆడానని, మంగళవారం రాత్రి సూర్య తన రూమ్‌కు వచ్చాడని, నువ్వు 3వ నెంబర్లో బ్యాటింగ్ చేస్తావన్నాడని, ఇది మంచి అవకాశం అని, నువ్వు నీ ఆటను నిరూపించు అని అతను చెప్పినట్లు తిలక్ తెలిపాడు. నువ్వ నాకు అవకాశం ఇచ్చావని, ఇక గ్రౌండ్‌లోనే చూపిస్తానని సూర్యకు సమాధానం ఇచ్చినట్లు తిలక్ వెల్లడించాడు.
మూడవ నెంబర్ పొజిషిన్‌ను వదులుకోవడం పట్ల సూర్యకుమార్ కూడా కామెంట్ చేశాడు. టీమ్ మీటింగ్‌ల్లో ఆట గురించి చర్చిస్తామని, నెట్ ప్రాక్టీసు, ఫ్రాంచైజీలు, రాష్ట్రాలకు ఆడుతున్న తరహాలోనే ఆడాలని సూచించామని, కొన్ని ఇన్నింగ్స్‌లో వాళ్లు విఫలం అయినా, అవకాశాలు ఇస్తామని, గెబెరాలో మ్యాచ్ జరిగిన సమయంలో.. తిలక్ వర్మ తన వద్దకు వచ్చి మూడవ నెంబర్లో బ్యాటింగ్ చేస్తానని చెప్పినట్లు సూర్య తెలిపాడు. ఇది నీ రోజు, నువ్వు ఎంజాయ్ చేయి అని అతనికి చెప్పానన్నాడు. అడిగిన పొజిషన్లో బ్యాటింగ్ చేసి తిలక్ రాణించాడని, ఇది సంతోషకరమైన విషయం అని సూర్య చెప్పాడు.
వరుసగా వేలి గాయాలు కావడంతో.. జింబాబ్వే, శ్రీలంక టూర్లకు దూరం అయినట్లు తిలక్ వర్మ తెలిపాడు.