గువహటి : హైదరాబాదీ యువ షట్లర్ తరుణ్ మన్నెపల్లితో పాటు తన్వి శర్మ, అన్మోల్ ఖర్బ్, అనుపమ ఉపాధ్యాయ గువహటి మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో ముందంజ వేశారు.
గురువారం మొదలైన ఈ టోర్నీ సింగిల్స్ విభాగాల్లో వీరంతా జయకేతనం ఎగురవేసి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్‌లో తరుణ్‌తో పాటు మీర్బా లువాంగ్, సంస్కార్ సరస్వత్, మానవ్ చౌదరి, సనీత్ దయానంద్, సమర్వీర్, ఆర్యమన్, తుషార్, ప్రణయ్, మిథున్, ప్రిక్వార్టర్స్ చేరారు.