అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ టెస్టులో ఇంగ్లండ్ కీపర్ జోస్ బట్లర్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బ్యాటర్ మార్కస్ హారిస్ ఫుల్ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బ్యాట్ అంచుకు తాకిన బంతి అది కీపర్‌కు దూరంగా పడిబోయింది. ఆ సమయంలో కుడి వైపు డైవ్ చేసిన బట్లర్.. అద్భుతమైన రీతిలో క్యాచ్‌ను పట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. ఇవాళ ప్రారంభమైన రెండవ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. 36 ఓవర్లలో వికెట్ నష్టానికి 69 రన్స్ చేసింది. వార్నర్, లబుషేన్ క్రీజ్‌లో ఉన్నారు.