BCCI | బుమ్రాకు విశ్రాంతి.. రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ.. భారత స్క్వాడ్‌లో ముగ్గురు ఐపీఎల్ హీరోలు..!
BCCI : అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. శుభ్‌మన్ గిల్(Shubman Gill) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది.
BCCI : అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. శుభ్‌మన్ గిల్(Shubman Gill) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. ఊహించినట్టుగానే సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు విశ్రాంతినిచ్చారు. పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్లో విఫలమవుతున్న రిషభ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా తప్పించి.. కేఎల్ రాహుల్‌కు బాధ్యతలు అప్పగించారు. దేశవాళీలో వికెట్ల వేటతో సెలెక్టర్లకు సవాల్ విసిరిన షమీ, అకీబ్ నబీకి చుక్కెదురైంది.
ఐపీఎల్ 19వ సీజన్ అనంతరం భారత జట్టు జూన్ 6న అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు, అనంతరం జూన్ 14 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఛండీగఢ్‌లో జరుగనున్న ఈ టెస్టు కోసం స్వాడ్ ఎంపిక కోసం మంగళవారం అగార్కర్ సారథ్యంలోని సెలెక్టర్ల బృందం, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా సమావేశం నిర్వహించారు. స్వదేశంలో జరుగబోయే ఈ టెస్టులో ఓపెనర్‌గా యశస్వీ జైస్వాల్, మిడిలార్డర్ బ్యాటర్లుగా పడిక్కల్, సాయి సుదర్శన్లకు అవకాశం లభించింది.
JUST IN: India’s ODI squad for the upcoming three-match series against Afghanistan in June 🇮🇳
Prince Yadav, Gurnoor Brar and Harsh Dubey receive their maiden call-ups to the one-day side pic.twitter.com/fdtVzXdbma
— ESPNcricinfo (@ESPNcricinfo) May 19, 2026
ఆ ముగ్గురికి ఛాన్స్
బుమ్రా గైర్హాజరీలో పేసర్లుగా సిరాజ్, ఐపీఎల్లో రాణిస్తున్న ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ ఎంపికయ్యారు. ఆశ్చర్యంగా బారాముల్లా ఎక్స్‌ప్రెస్.. జమ్ముకశ్మీర్ తొలిసారి రంజీ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకమైన అకీబ్ నబీని సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. స్పిన్ యూనిట్లో కుల్దీప్ యాదవ్, ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్, పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డికి స్క్వాడ్‌లో చోటు దక్కింది. అఫ్గనిస్థాన్‌తో టెస్టు ఆడడం ద్వారా ప్రిన్స్, గుర్నూర్, హర్ష్ దూబేలు సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేయనున్నారు.
🚨 News 🚨
Presenting #TeamIndia‘s squads for the @IDFCFIRSTBank Test match and the 3️⃣-match ODI series against Afghanistan in June 🙌#INDvAFG pic.twitter.com/hFiABALLld
— BCCI (@BCCI) May 19, 2026
వన్డే జట్టులో.. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌తో పాటు హార్దిక్ పాండ్యాకు చోటు దక్కింది. అలానే.. ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు. కాబూలీ టీమ్‌తో జూన్ 14 నుంచి భారత జట్టు మూడు వన్డేలు ఆడనుంది. తొలి వన్డే ధర్మశాలలో, లక్నోలో జూన్ 17న రెండో వన్డే , జూన్ 20న చెన్నైలో మూడో వన్డే నిర్వహించనున్నారు.
ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే

భారత టెస్టు స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), పడిక్కల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్.
భారత వన్డే స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ యాదవ్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

